చెంచురెడ్డి గారూ! మీ ఐడియా సూప‌రు!

చెంచు రెడ్డి అని నెల్లూరు జిల్లాలో ఓ రైతు. త‌న‌కు ఉన్న ప‌దెక‌రాల్లో క్యాలిఫ్ల‌వ‌ర్‌, క్యాబేజీ పంట వేశాడు. వేసిన ప్ర‌తీసారీ విర‌గ‌పండుతుంటుందా పంట‌. ఈ సారి కూడా మాంఛి దిగుబ‌డి చేతికి అందేలా క‌నిపించింది.

న‌రుడి దిష్టికి నాప‌రాతైనా ప‌గులుతుందంటారు పెద్ద‌లు. అందుకే- పంట దిగుబ‌డికి ముందే ఎన్ని దిష్టిబొమ్మ‌లు పెట్టినా పెద్ద‌గా ఫ‌లితం క‌నిపించ‌లేద‌ట‌. అందుకే ఈ సారి ఏకంగా మాజీ పోర్న్‌స్టార్ స‌న్నీలియోన్ అర్ధ‌న‌గ్న ఫొటోను ఫ్లెక్సీగా మార్చి, దిష్టిబొమ్మ‌గా పెట్టాడు. `ఒరేయ్‌! న‌న్ను చూసి ఏడ‌వ‌కురా!` అని క్యాప్ష‌న్ త‌గిలించాడు.

ఇక అంతే! దిగుబ‌డి అద్దిరిపోయింద‌ట‌. ఎందుకంటే.. దారిన పోయే జ‌నం పంట‌కు బ‌దులుగా సన్నీలియోన్ ఫ్లెక్సీని చూస్తూ వెళ్తున్నారు కాబ‌ట్టి. ఈ ర‌కంగా జ‌నం దృష్టిని, దిష్టినీ మ‌ర‌ల్చాన‌ని, ఫ‌లితంగా మంచి దిగుబ‌డి చేతికి అందింద‌ని చెబుతున్నారాయ‌న‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here