ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్ల‌ను గ‌డ‌గ‌డ‌లాడించాడు: విమానం దిగి లోక‌ల్ ట్రైన్‌లో ఇంటికెళ్లాడు! అత‌నే..!

ముంబై: ద‌క్షిణాఫ్రిక‌న్ క్రికెట‌ర్ల‌ను వారి గ‌డ్డ‌పైనే టీ20 మ్యాచుల్లో గ‌డ‌గ‌డ‌లాడించిన బౌల‌ర్ అత‌ను. మూడురోజుల కింద‌టే టీమ్‌తో పాటు ముంబైకి చేరుకున్నాడు. అంద‌రూ త‌మ త‌మ కార్ల‌ల్లో ఇంటికెళ్లిపోగా.. శార్దూల్ మాత్రం నేరుగా అంధేరి రైల్వేస్టేష‌న్‌కు వెళ్లాడు. క్యూలో నిల్చుని టికెట్ తీసుకున్నాడు.

సీటు దొర‌క్క‌పోతే లోక‌ల్ రైల్లో నిల్చుని మ‌రీ ఇంటికెళ్లాడు. అత‌నే శార్దూల్ ఠాకూర్‌. టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్‌. రైల్లో త‌మ వెంట ప్ర‌యాణిస్తున్న‌ప్ప‌టికీ.. చాలామంది అత‌ణ్ణి గుర్తు ప‌ట్ట‌లేక‌పోయారట‌. 26 సంవ‌త్స‌రాల శార్దుల్ ఠాకూర్‌కు ఈ ప్ర‌యాణం కొత్తేమీ కాదు. తాను నివ‌సించే పాల్‌ఘ‌ర్ నుంచి అంధేరికి లేదా విమానాశ్ర‌యానికి వెళ్లాలంటే లోక‌ల్ రైల్లోనే వెళ్తుంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here