కుమార్తె ఫొటో ఫేస్‌బుక్‌లో చూసి..పోస్ట్ చేసిందెవ‌రో తెలుసుకుని..!

రాయచూర్‌: ఫేస్‌బుక్‌లో త‌న కుమార్తె ఫొటోల‌ను అప్‌లోడ్ చేసినందుకు ప్రశ్నించిన తండ్రిపై కొంద‌రు యువ‌కులు దాడి చేశారు. అత‌ణ్ణి కొట్టారు. దీనితో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఆ తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని రాయ‌చూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని సింధనూరు తాలూకా గౌడన బావి గ్రామానికి చెందిన రామనగౌడ కుమార్తె బసవ లింగమ్మ. సింధనూరులో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ సింధనూరుకు వచ్చి వెళ్తుండేది. కింద‌టి నెల 25వ తేదీన గౌడ‌న‌బావి గ్రామంలో జాత‌ర జ‌రిగింది. జాత‌ర‌ను పుర‌స్క‌రించుకుని బ‌స‌వ‌లింగ‌మ్మ క‌ల‌శాన్ని ఎత్తుకుని ఆల‌యానికి వెళ్లింది.

ఆమె క‌ల‌శాన్ని ఎత్తుకున్న ఫొటో, వీడియోను తీసిన అదే గ్రామానికి చెందిన కొంద‌రు యువ‌కులు దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ విష‌యం తెలిసిన రామ‌న‌గౌడ.. ఆ యువ‌కుల‌ను మంద‌లించారు. ఈ సంద‌ర్భంగా వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకుంది. ఆవేశానికి గురైన రామ‌న‌గౌడ.. క‌న‌క‌రాయ అనే యువ‌కుడిని కొట్టారు. ఈ విష‌యం పంచాయితీ దాకా వెళ్లింది.

పెద్ద‌లు పంచాయ‌తీ పెట్టారు. రామ‌న‌గౌడ‌ను అవ‌మానించారు. దీనితో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన రామ‌న‌గౌడ విషం సేవించి, ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. త‌న తండ్రి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడ్డార‌నే విష‌యం తెలిసిన బ‌స‌వ‌లింగ‌మ్మ కూడా విషం తాగి, ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై బ‌ళ‌గానూరు పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here