బెల్ట్ తీసుకొని చితకబాదాడు.. పైకి ఎత్తి విసిరేశాడు.. తండ్రే ఎందుకు ఇలా చేశాడంటే..!

కన్నా తండ్రే కొడుకును చితకబాదాడు.. బెల్ట్ తీసుకొని చితకబాదాడు. పైకి ఎత్తి కిందకు విసిరేశాడు. కన్నతండ్రి ఇలా కొడుకుపై కర్కషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు లోని కెంగేరి గ్లోబల్ విలేజ్ లో చోటుచేసుకుంది.

ఇంతకూ ఆ వ్యక్తి కొడుకును ఎందుకు అంతగా కొడుతున్నాడో తెలుసా..? అబద్దాలు ఎక్కువగా ఆడుతున్నాడని.. విపరీతమైన అబద్దాలు చెప్తుండడంతో ఆ తండ్రి కొడుకును ఇష్టం వచ్చినట్లు బాదాడు. చిన్న పిల్లలు అబద్దాలు చెబుతుంటే చెప్పకూడదు.. మాట వినాలి అని సర్ది చెప్పాలి కానీ మరీ ఇంత కఠినంగా ప్రవర్తించకూడదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. తండ్రే మరీ ఇంత ఘోరంగా ప్రవర్తించాలా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నాన్నా నేను అబద్దం చెప్పలేదు.. చెప్పలేదు అని ఎంతగా మొత్తుకుంటున్నా కూడా తండ్రి కనికరం చూపలేదు. చిన్న పిల్లలతో నడుచుకునే విధానం ఇది కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here