కూతురి పెళ్ళి ఇష్టం లేక తండ్రి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.. అతన్ని చూసిన కూతురు ఏమందంటే..!

కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం ఆ తండ్రికి నచ్చలేదు. దీంతో విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తాగేశాడు కూడానూ.. తండ్రి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా కూడా ఆ యువతి ప్రేమించిన వాడితో వెళ్ళడానికే సరే అంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం లోని కోళార్ లో చోటుచేసుకుంది.

బెంగళూరుకు చెందిన శంకర్ ప్రసాద్ కూతురు దివ్య వారం ముందు కోళారు లోని గంగమ్మన పాల్య నివాసి అయిన హరి కృష్ణ ను పెళ్ళిచేసుకుంది. వారం క్రితం దివ్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఆరోజే ఆమె అతడిని పెళ్ళి చేసుకుంది. దివ్య కోళారులో ఉందన్న విషయం తెలుసుకున్న శంకర్ ప్రసాద్ అక్కడికి వచ్చాడు. పోలీసులు ఆమెనూ.. తండ్రిని ఉంచి మాట్లాడుతూ ఉన్నారు. వారి మధ్య మాటలు జరుగుతూ ఉండగానే దివ్య అతడు చెప్పిన మాటలకు అసలు ఒప్పుకోలేదు. దీంతో తన మాట విననందుకు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు శంకర్ ప్రసాద్. వెంటనే పోలీసులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

కోళారులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకొని వచ్చారు. ప్రస్తుతం అతడు చావు.. బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తండ్రి అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దివ్య ప్రేమించిన వాడితోనే ఉండడానికి మొగ్గు చూపించింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here