క‌న్న‌కూతుర్ని త‌న స్నేహితుల‌కు `గిఫ్ట్‌`గా ఇచ్చిన కిరాత‌క తండ్రి!

ల‌క్నో: క‌న్న‌కూతురిని త‌న ఇద్ద‌రు స్నేహితుల‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడో కిరాత‌క తండ్రి. అక్క‌డితో ఆగ‌లేదు. త‌న ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి అత్యాచారానికి తెగ‌బడ్డాడు. వారితో క‌లిసి గ్యాంగ్‌రేప్‌న‌కు పాల్ప‌డ్డాడు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఈ నెల 15వ తేదీన జిల్లాలోని క‌మ‌లాపూర్‌లో జ‌రిగిన ఈ ఘట‌న బాధితురాలి ఫిర్యాదుతో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు ఇద్ద‌ర్నీ అరెస్టు చేశారు. మ‌రొక‌రు ప‌రారీలో ఉన్నారు. అత‌ని కోసం గాలిస్తున్నారు. బాధితురాలు వివాహిత‌. 12 ఏళ్ల కింద‌ట ఆమెకు వివాహ‌మైంది. ఓ కుమారుడు ఉన్నాడు. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా భ‌ర్త‌కు దూరంగా ఉంటోంది.

ఈ నెల 15వ తేదీన బాధితురాలి తండ్రి ఆమె ఇంటికి వ‌చ్చాడు. క‌మ‌లాపూర్ స‌మీపంలో ఏటేటా జ‌రిగే ఓ ప్ర‌ద‌ర్శ‌న‌కు ఆమెను తీసుకెళ్లాడు. అక్క‌డికెళ్లిన త‌రువాత మాన్‌సింగ్, మిరాజ్ అనే త‌న స్నేహితుల‌ను ఆ ప్ర‌ద‌ర్శ‌న‌కు పిలిపించుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్లే స‌మ‌యంలో.. మ‌ద్యం మ‌త్తులో ఆమెను బైక్‌పై మిరాజ్ ఇంటికి తీసుకెళ్లాడు.

అక్క‌డ ఆమెను నిర్బంధించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. మొద‌ట త‌న‌పై అత్యాచారం చేసింది త‌న తండ్రేన‌ని బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

 

వారి నుంచి తప్పించుకొని ఇంటికొచ్చిన మహిళ జరిగిందంతా తన తల్లికి వివరించింది. వెంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పారు. ఒక నిందితుడిని అరెస్ట్ చేశామని, మహిళ తండ్రితో పాటు ఇంకో వ్యక్తి పరారీలో ఉన్నారని అడిషనల్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ మర్తాండ్ ప్రకాశ్ సింగ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here