నాలుగేళ్ల కుమార్తె నిద్ర‌పోతుంద‌నుకుంది..అర్ధ‌రాత్రి గానీ అస‌లు విష‌యం తెలియ‌లేదు!

త‌ల్లితో గొడ‌వ ప‌డుతోన్న భ‌ర్త‌ను వారించ‌డానికి వెళ్లిందో భార్య‌. ఆమెతోనూ ఘ‌ర్ష‌ణ‌కు దిగాడత‌ను. మ‌ద్యం మ‌త్తులో భార్య‌ను క‌ట్టెతో కొట్టాడు. ఆ స‌మ‌యంలో నాలుగేళ్ల కుమార్తె కూడా అక్క‌డే ఉంది.

ఓ దెబ్బ ఆ పాప‌కు కూడా బ‌లంగా త‌గిలింది. ఇరుగుపొరుగు వారు వ‌చ్చి విడిపించ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. క‌ర్ర దెబ్బ‌కు త‌ల ప‌ట్టుకుని కూర్చున్న కుమార్తెను మంచంపై నిద్ర‌పుచ్చింది.

మ‌ద్యం మ‌త్తులో ఏదేదో వాగుతున్న భ‌ర్తను స‌ముదాయిస్తూ అర్ధ‌రాత్రి వ‌ర‌కూ ఉండిపోయిందా త‌ల్లి. కొద్దిసేప‌టి త‌రువాత మంచినీటి కోసం కుమార్తెను లేప‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. ఆమె లేవ‌లేదు. కుమార్తె మ‌ర‌ణించింద‌నే విష‌యాన్ని ఆమె అప్ప‌టికి గానీ గుర్తించ‌లేక‌పోయింది. తెలంగాణ‌లోని ఖ‌మ్మంజిల్లా బోన‌క‌ల్ మండ‌లం జాన‌కీపురంలో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌.

జిల్లాలోని బోన‌క‌ల్లు మండ‌లం జాన‌కీపురం గ్రామానికి చెందిన కృష్ణయ్య, నాగమణి దంపతులు జీవ‌నోపాధి కోసం విశాఖపట్నానికి వ‌ల‌స వ‌చ్చారు. కొద్దిరోజుల కింద‌టే కృష్ణ‌య్య అమ్మమ్మ మ‌ర‌ణించగా.. ఆమె కర్మకాండ కోసం వారిద్ద‌రూ కుమార్తె సుప్రియ స‌హా జానకీపురం వచ్చారు.

ఈ సంద‌ర్భంగా కృష్ణ‌య్య త‌న తల్లి శేషమ్మ గొడ‌వ ప‌డ్డాడు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న కృష్ణ‌య్య దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు. ఆ స‌మ‌యంలో అడ్డొచ్చిన భార్య‌ను క‌ర్ర‌తో కొట్టాడు. సుప్రియ‌కు కూడా ఓ దెబ్బ బ‌లంగా త‌గిలింది.

దీనితో ఆ పాప స్పృహ త‌ప్పింది. నిద్ర‌పోతోంద‌ని భావించిన త‌ల్లి మంచంపై వ‌దిలివేసింది. అర్ధరాత్రి తర్వాత కుమార్తె మరణించినట్లు గుర్తించింది. దీనితో వారి ఇంట్లో విషాదం నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here