పెళ్లి రిసెప్ష‌న్‌లో అంద‌రి ముందూ కాబోయే కోడ‌లికి లిప్ టు లిప్ కిస్ ఇచ్చిన మామ‌!

బీజింగ్‌: పెళ్లికి కొన్ని గంట‌ల ముందు ఏర్పాటు చేసిన రిసెప్ష‌న్‌లో సిగ్గుమాలిన ప‌నికి దిగాడు పెళ్లి కుమారుడి తండ్రి. త‌న‌కు కాబోయే కొత్త కోడ‌లికి అంద‌రి ముందూ లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు.

వ‌ధువును త‌మ బంధు మిత్రుల‌కు ప‌రిచ‌యం చేసే స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్‌లో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

జియాంగ్షు ప్రావిన్స్ యాన్‌ఛెంగ్ న‌గ‌రంలోని వుఝౌ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్లాజాలో ఈ రిసెప్ష‌న్‌ను ఏర్పాటు చేశారు. అంద‌రికీ క‌నిపించేలా ఏర్పాటు చేసిన వేదిక‌పై పెళ్లి గౌనులో మెరిసిపోతున్న వ‌ధువుతో క‌లిసి వ‌చ్చాడు.

ప‌రిచ‌యం చేస్తూండ‌గా హ‌ఠాత్తుగా ఆమె భుజాల‌పై చేతులు వేసి, వెన‌క వైపు నుంచి ఘాటుగా లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌తో అంద‌రూ నిశ్చేష్టుల‌య్యారు. మ‌ద్యం మ‌త్తులో అత‌ను ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్టు చెబుతున్నారు.

వారి పేర్లేవీ తెలియ‌రాలేదు. ఈ నెల 22 వ తేదీన ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ ఎనిమిది సెకెన్ల వీడియో సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here