విద్యుద్ఘాతానికి గురై చెయ్యి కోల్పోయిన ఆరేళ్ల కుమార్తెకు అండ‌గా నిల‌వాల్సిన క‌న్న‌తండ్రే..!

విద్యుద్ఘాతానికి గురై.. భుజాల వ‌ర‌కూ ఓ చెయ్యిని కోల్పోయిన చిన్నారికి అండ‌గా నిల‌వాల్సిన తండ్రి కాలయముడు అయ్యాడు. త‌న క‌ళ్ల‌ముందు ఉంటే న‌రికేస్తానంటూ ఆ పాప‌ను, భార్య‌ను హెచ్చ‌రించాడు.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని నెల‌మంగ‌ల‌లో చోటు చేసుకుంది. స‌య్య‌ద్‌పాషా అనే వ్య‌క్తి త‌న భార్య ష‌బీనాబీ, కుమార్తె జ‌రీనాతో క‌లిసి నెల‌మంగ‌ల‌లోని రేణుకాన‌గ‌ర‌లో నివాసం ఉంటున్నాడు.

రేణుకాన‌గ‌ర‌లోని వారు నివాసం ఉండే ఇంటికి అతి స‌మీపంలోనే విద్యుత్ తీగ‌లు ఉన్నాయి. నెల‌రోజుల కింద‌ట జ‌రీనా ఇంటి పైన ఆడుకుంటూ దుర‌దృష్ట‌వ‌శావ‌త్తూ ఆ విద్యుత్ తీగ‌ల‌కు త‌గిలింది.

విద్యుద్ఘాతానికి గురై తీవ్రంగా గాయ‌ప‌డింది. వెంట‌నే ఆ చిన్నారిని బెంగ‌ళూరులోని విక్టోరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతుండ‌గా.. విద్యుద్ఘాతానికి గురైన చెయ్యి సెప్టిక్ అయ్యింది. దాన్ని తీసేయాల్సి వ‌చ్చింది.

త‌ల్లిదండ్రుల అనుమ‌తి తీసుకుని డాక్ట‌ర్లు జ‌రీనా చెయ్యిని భుజం వ‌ర‌కూ తొల‌గించారు. ఆ త‌రువాతే జ‌రీనాకు అస‌లు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. తండ్రి స‌య్య‌ద్ పాషా ఆమెను ధ్వేషించ‌డం మొద‌లు పెట్టాడు.

చెయ్యి లేద‌ని, ఎవ‌రు పెళ్లి చేసుకుంటారంటూ రోజూ సూటిపోటి మాట‌ల‌తో వేధించ‌డం ప్రారంభించాడు. ష‌బీనాబీ ఎంత న‌చ్చ‌జెప్పిన‌ప్ప‌టికీ వినేవాడు కాదు.

దీనితో ష‌బీనాబీ, జ‌రీనా దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డ్డారు. త‌న కుమార్తెకు న్యాయం చేయాల‌ని, విద్యుత్ అధికారులు ప‌రిహారాన్ని ఇప్పించాల‌ని ఆమె ప్రాధేయ‌ప‌డుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here