కుమార్తె సంపాదిస్తున్నా.. తండ్రి పెళ్ళి కోసం డబ్బులు ఇవ్వాల్సిందే..!

కుమార్తె సంపాదిస్తున్నప్పటికీ తన పెళ్లి కోసం తండ్రి డబ్బులు ఇవ్వాలని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. వివాహేతర సంబంధాల ద్వారా పుట్టిన సంతానానికి కూడా ఆ హక్కు ఉందని కోర్టు సంచలన తీర్పు చెప్పింది. భార్య, కుమార్తెకు అదనపు ఆదాయ వనరులు ఉన్నప్పటికీ వివాహం కోసం డబ్బులు కోరవచ్చని స్పష్టం చేసింది.

కోయంబత్తూరుకు చెందిన అంబిక అరవిందాక్షణ్ తన పెళ్లి ఖర్చులకు తండ్రి ముందుకు రావడం లేదని ఆరోపిస్తూ అంబిక పాలక్కాడ్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తండ్రి నుంచి రూ.5 లక్షలు ఇప్పించాల్సిందిగా కోరింది. అద్దెల ద్వారా వారికి నెలకు రూ.12వేల ఆదాయం వస్తుండడంతో తండ్రి నుంచి పెళ్లి ఖర్చులకు డబ్బులు అడగడం సరికాదంటూ ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో అంబిక హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన కోర్టు పాలక్కాడ్ కుటుంబ న్యాయస్థానం తీర్పును తప్పుబట్టింది. వారికొచ్చే రూ.12 వేల ఆదాయాన్ని చూపించి కేసును కొట్టివేయడం సరికాదని పేర్కొంది. తల్లీ, కుమార్తెకు అదనపు ఆదాయం ఉన్నప్పటికీ కుమార్తె పెళ్లి కోసం తండ్రి డబ్బులు చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here