ఎఫ్‌బీఐ ఏజెంట్‌..డాన్స్ చేస్తూ ప‌ల్టీ కొట్టాడు! న‌డుములో దాచుకున్న‌ పిస్ట‌ల్ పేలింది..!

అమెరికా ద‌ర్యాప్తు సంస్థ ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్‌. దీనంత‌టి ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యూరో ఇంకొక‌టి లేదంటారు దీని గురించి తెలిసిన వారు. అలాంటి బ్యూరో ఏజెంట్‌గా ప‌నిచేస్తోన్న ఓ యువ‌కుడు నైట్‌క్ల‌బ్‌లో డాన్స్ చేశాడు. డాన్స్ చేస్తూ, చేస్తూ వెన‌క్కి ప‌ల్టీ కొట్టాడు. దీనితో- అత‌ను త‌న న‌డుములో దోపుకొన్న పిస్ట‌ల్ కిందికి జారి ప‌డింది. ప‌డటం, ప‌డ‌టంతోనే పేలింది. ఈ ఎఫ్‌బీఐ ఏజెంట్ డాన్స్ చేస్తూ చ‌ప్ప‌ట్లు కొడుతున్న ఓ యువ‌కుడి కాలిలోకి దూసుకెళ్లింది బుల్లెట్‌.

అమెరికాలోని డెన్వ‌ర్‌లో ఉన్న నైట్‌క్ల‌బ్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చల్ చేస్తోంది. గాయ‌ప‌డ్డ యువ‌కుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అత‌ని ప్రాణానికి ప్ర‌మాద‌మేమీ లేద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై ఎఫ్‌బీఐ ఉన్న‌తాధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న స‌మ‌యంలో ఆ ఏజెంట్ డ్యూటీలో లేడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here