ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌: కేసీఆర్ మ‌ధ్యాహ్న భోజనం క‌రుణానిధి ఇంట్లో!

చెన్నై: దేశంలో కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర కూట‌ముల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయ‌డానికి ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తోన్న టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ఆ దిశ‌గా మ‌రో అడుగు వేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు స‌మ‌దూరాన్ని పాటిస్తోన్న డీఎంకే నేత‌ల‌తో ఆయ‌న భేటీ అయ్యారు.

దీనికోసం ఆయ‌న ఆదివారం మ‌ధ్యాహ్నం చెన్నైకి వ‌చ్చారు. హైద‌రాబాద్ బేగంపేట్ విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరి వ‌చ్చిన కేసీఆర్‌.. మ‌ధ్యాహ్నం చెన్నైకి చేరుకున్నారు. ఆయ‌న‌ వెంట మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు కేకే, వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌ ఉన్నారు.

నేరుగా క‌రుణానిధి నివాసానికి వ‌చ్చారు. క‌రుణానిధి కుమారుడు, డీఎంకే కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు స్టాలిన్.. కేసీఆర్‌కు సాద‌రంగా ఆహ్వానించారు. క‌రుణానిధి, స్టాలిన్‌, కేంద్ర మాజీమంత్రి రాజా, టీఆర్ బాలుతో సుమారు రెండున్న‌ర గంట‌ల పాటు స‌మావేశ‌మ‌య్యారు. త‌మిళ న‌టుడు ఉద‌య‌నిధి స్టాలిన్ ఈ భేటీలో పాల్గొన్నారు.

ఎన్డీయే, యూపీయేల‌కు ప్ర‌త్యామ్నాయ కూట‌మి ఏర్పాటుపై చ‌ర్చించారు. త‌మ‌తో క‌లిసి రావాల్సిందిగా కోరారు. మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌తో కొద్దిరోజుల కింద‌టే బెంగ‌ళూరులో నిర్వ‌హించిన చ‌ర్చ‌ల సారాంశాన్ని కూడా వివ‌రించారు. క‌రుణానిధి నివాసంలోనే మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here