పారాచుట్‌తో గాల్లోకి ఎగిరిన భార్య‌! ఆమె మ‌ర‌ణాన్ని అనుకోకుండా వీడియో తీసిన భ‌ర్త!

మెక్సికో సిటీ: పారాచూట్‌ను భుజానికి త‌గిలించుకుని, త‌న భార్య గాల్లోకి ఎగిరిన దృశ్యాన్ని త‌న సెల్‌ఫోన్‌లో బంధిస్తున్నాడా భ‌ర్త‌. అలా గాల్లోకి ఎగురుతున్న స‌మ‌యంలోనే.. ఇంకో పారాచూట్ ఎదురుగా వ‌చ్చింది. బ‌లంగా ఢీ కొట్టింది. దీనితో ఆమె అమాంతం 50 అడుగుల ఎత్తు నుంచి కిందికి ప‌డిపోయింది.

అలా నేల మీద ప‌డ‌టానికి ముందే- ఆమె ప్రాణాలు గాల్లో క‌లిశాయి. ఈ దృశ్యాన్నంత‌టినీ మృతురాలి భ‌ర్తే వీడియో తీయ‌డం అత్యంత విషాద‌క‌రం. ఈ ఘ‌ట‌న మెక్సికోలో ప‌సిఫిక్ స‌ముద్ర తీర ప్రాంత న‌గ‌రం ప్యూర్టో ఎస్కోన్‌డిడోలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు ఉర్సులా హెర్నాండెజ్‌. 47 సంవ‌త్స‌రాలు.

సెల‌వుల సంద‌ర్భంగా ఉర్సులా త‌న భ‌ర్త‌తో క‌లిసి ప్యూర్టో ఎస్కోన్‌డిడోకు వ‌చ్చారు. స‌ముద్ర తీరంలో ముచ్చ‌ట‌ప‌డి ఆమె పారాచూట్‌ను క‌ట్టుకుని గాల్లోకి ఎగిరారు. కొద్దిసేప‌టికే ఇంకో పారాచూట్‌లో ఎదురుగా వ‌చ్చిన మ‌హిళ ఆమెను ఢీ కొట్టారు. దీనితో ఉర్సులా అంతెత్తు నుంచి కింద‌ప‌డి, దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here