ఢిల్లీ పోలీస్ హెడ్‌ కానిస్టేబుల్‌ను కింద‌ప‌డేసి లాఠీల‌తో కుళ్ల‌బొడిచారు!

న్యూఢిల్లీ: ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఓ పోలీస్ హెడ్‌ కానిస్టేబుల్‌, ఆర్మీ జ‌వాన్ల మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకుంది. ఈ గొడ‌వ కాస్తా ఘ‌ర్ష‌ణ‌గా మారింది. ఈ సంద‌ర్భంగా జ‌వాన్లు హెడ్ కానిస్టేబుల్‌ను కింద‌ప‌డేసి చిత‌గ్గొట్టారు.

దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కంటోన్మెంట్ ప్రాంతం పూర్తిగా ఆర్మీ ఆధీనంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో ప్ర‌వేశించే చోట ఆర్మీ జ‌వాన్లు కాప‌లా కూడా ఉంటారు.

ఓ వెరిఫికేష‌న్ కోసం హెడ్ కానిస్టేబుల్ కంటోన్మెంట్ ప్రాంతంలోకి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించ‌గా జ‌వాన్లు అడ్డుకున్నారు. ఐడీ కార్డును చూపించి, వెళ్లాల్సిందిగా సూచించారు. ఐడీ కార్డును చూపించ‌డానికి హెడ్ కానిస్టేబుల్ నిరాక‌రించ‌డంతో ఈ గొడ‌వ చెల‌రేగింది.

ఇద్ద‌రి మ‌ధ్యా చోటు చేసుకున్న వాగ్వివాదం ఘ‌ర్ష‌ణ దాకా వెళ్లింది. ఒక‌రినొక‌రు తోసుకున్నారు. దీనితో ఆగ్ర‌హించిన ముగ్గురు జ‌వాన్లు హెడ్ కానిస్టేబుల్‌ను కింద ప‌డేసి లాఠీల‌తో కొట్టారు.

స్థానికులు స‌ర్ది చెప్పి కానిస్టేబుల్‌ను విడిపించారు. లాఠీ దెబ్బ‌ల‌కు గాయ‌ప‌డిన హెడ్ కానిస్టేబుల్ చివ‌రికి ఆసుప‌త్రిలో చేరారు. దీన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన ఢిల్లీ పోలీసులు విచార‌ణ‌కు ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here