పుట్టిన ఊరికోసం ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్  సినిమాలకు గుడ్ బై, !

ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ అంటే తెలియని సినీ అభిమాని ఉండడు. దశాబ్దాల కాలం టాలీవుడ్ లో వీరిద్దరూ ఫైట్ మాస్టర్స్ గా కొనసాగుతున్నారు. ఈ అన్నదమ్ములిద్దరూ కలసి ఫైట్స్ కంపోజ్ చేసిన ఎన్నో చిత్రాలు ఘాన విజయం సాధించాయి. 1987 నుంచి వీరిద్దరూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాము పుట్టి పెరిగిన పల్లెటూరి వాతావరణం అంటే తమకు ఎంతో ఇష్టం అని రామ్ లక్ష్మణ్ పలు సందర్భాల్లో తెలియజేశారు. తాజగా వీరిద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారట.

ఫైట్ మాస్టర్స్ గా ప్ర‌త్యేక గుర్తింపు
టాలీవుడ్ లో ఫైట్ మాస్టర్స్ గా రామ్ లక్ష్మణ్ చెరగని ముద్ర వేశారు. చైనా హీరోల నుంచి బడా హీరోల చిత్రాల వరకు వీరే ఫైట్ మాస్టర్. 1987 లో అసిస్టెంట్ ఫైట్ మాస్టర్స్ గా మొదలైన వీరి ప్రయాణం ప్రస్తుతం టాప్ ఫైట్ మాస్టర్స్ గా దూసుకుపోతున్నారు.

ఎన్నో ఘనవిజయాలు
రామ్ లక్ష్మణ్ తమ కెరీర్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 వంటి చిత్రాలు వీరికి మంచి గుర్తింపు తీసుకుని వచ్చాయి.

1100 సినిమాలు 
రామ్ లక్ష్మణ్ తెలుగు, తమిళ, మాయలం, కన్నడ భాషల్లో 11 వందలకు పైగా సినిమాలకు ఫైట్స్ అందించారంటే వీరి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలోని ఎంటువంటి వివాదంలో వీరు రాల దూర్చరు. వారి పని వారు చేసుకుని వెళుతుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here