హార్దిక్ పాండ్యా పై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయండన్న కోర్టు.. ఎందుకంటే..!

హార్దిక్ పాండ్యా.. ఎన్నో సంవత్సరాల తర్వాత భారతజట్టుకు ఓ మంచి ఆల్ రౌండర్ దొరికాడని సంబరపడ్డారు. కానీ ఇటీవలి కాలంలో ఆటతో కంటే బయటి విషయాల ద్వారానే హార్దిక్ పాండ్యా గురించి ఎక్కువగా చర్చించుకుంటూ ఉన్నారు. తాజాగా అతడు అంబేద్కర్ మీద చేసిన ట్వీట్ తో ఇబ్బందులు కొనితెచ్చుకుంటూ ఉన్నాడు. అంబేద్కర్‌ను అవమానించేలా ట్వీట్ చేసిన హార్దిక్ పాండ్యాపై కేసు నమోదు చేయాల్సిందిగా ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ కోర్టు పోలీసులను ఆదేశించింది.

గతేడాది డిసెంబరు 26న పాండ్యా చేసిన ట్వీట్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించేలా ఉందంటూ డీఆర్ మేఘ్‌వాల్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాండ్యా తన ట్వీట్‌తో అంబేద్కర్‌ను, ఆ సామాజిక వర్గ మనోభావాలను దెబ్బతీశాడని అందులో పేర్కొన్నారు. రిజర్వేషన్లు అనే వ్యాధిని దేశంలో వ్యాప్తి చేసిన అంబేద్కర్.. అంటూ పాండ్యా చేసిన ట్వీట్ అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. పాండ్యా లాంటి పాప్యులర్ క్రికెటర్ ఇటువంటి ట్వీట్లు చేయడం సమంజసం కాదన్న పిటిషన్‌దారు ఆ వర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాణాన్ని అపహాస్యం చేశాడని ఆరోపించారు. అతడు చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందేనని చెప్పారు. పిటిషన్‌ను స్వీకరించిన ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు పాండ్యాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here