తిరుమల ఆలయం చుట్టూ అలుముకున్న పొగ.. ఎన్నిసార్లు ఈ అగ్ని ప్రమాదాలు..!

పోయిన నెలలో ఒక అగ్నిప్రమాదం.. ఇప్పుడు ఇంకొకటి.. తిరుమలలో చోటుచేసుకుంటున్న ఘటనలు ఇవి. ఈరోజు మరోసారి తిరుమలలో అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే వంటశాల పోటులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొయ్యిపై మరుగుతున్న నేయిలో నీరు పడిన నేపథ్యంలో మంటలు అంటుకుని ఉండవచ్చని చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది… అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. క్షణాల్లో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో పొగ నిండిపోయింది.

గత నెలలో కూడా పోటులో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. టీటీడీ అధికారులు ఎన్ని చర్యలను తీసుకున్నప్పటికీ… పోటులో అగ్నిప్రమాదాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పోటులో పని చేసేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరుస సెలవులు కావడంతో భక్తులు కూడా శ్రీవారి దర్శనం కోసం బారులు తీరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here