అక్షయ్ కుమార్ సినిమా క్లైమాక్స్ లో భారీ అగ్నిప్రమాదం..!

అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న కేసరి సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని ఓ గ్రామంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో భాగంగా జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో చోటుచేసుకున్న పొరపాటు కారణంగా మొత్తం సెట్ కాలిపోయింది. అయితే ఎవరు కూడా ఈ ప్రమాదంలో గాయపడలేదు.


స‌రాగ‌ర్హి యుద్ధంకి సంబంధించి సీన్స్ తెర‌కెక్కించే క్ర‌మంలో కొన్ని బాంబ్ బ్లాస్ట్ సీన్స్ ప్లాన్ చేశారు. అనుకోకుండా ఒక బాంబ్ భారీగా పేల‌డంతో సెట్ అంతా ద‌గ్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ సిక్కుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. క‌థానాయిక‌గా ప‌రిణితీ చోప్రా న‌టిస్తుంది. కొద్ది రోజులుగా అక్ష‌య్ కుమార్‌తో పాటు ప‌లువురు న‌టీన‌టుల‌తో క్లైమాక్స్ చిత్రీక‌రిస్తున్నారు. ఈ మధ్యనే అక్షయ్ కుమార్ పార్ట్ పూర్తి కావ‌డంతో ఆయ‌న ముంబై వెళ్ళారు. మిగతా యూనిట్ అంతా అక్కడే ఉన్నారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్, అజూర్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1897లో చోటుచేసుకున్న సరాగార్హి యుద్ధానికి సంబంధించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 21 మంది సిక్కులు.. 10వేల మంది ఆఫ్ఘన్ సైన్యాన్ని ఎలా అడ్డుకున్నారన్నదే ఈ చిత్ర కథ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here