అదే న‌డ‌క‌.. అదే న‌డ‌త‌!

ముంబై: ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటో.. మన మాజీ ప్ర‌ధాన‌మంత్రి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్‌ది అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే- ఆయ‌న మ‌న్మోహ‌న్ సింగ్ కాదు కాబ‌ట్టి. అక్క‌డున్న‌ది బాలీవుడ్ వెట‌ర‌న్ యాక్ట‌ర్ అనుప‌మ్ ఖేర్‌. `ది యాక్సిడెంట‌ల్ ప్రైమ్ మినిస్ట‌ర్‌` సినిమాలోని ఓ స‌న్నివేశం అది.

మ‌న్మోహ‌న్ సింగ్ జీవిత చ‌రిత్ర‌పై రూపుదిద్దుకుంటోన్న సినిమా `ది యాక్సిడెంట‌ల్ ప్రైమ్ మినిస్ట‌ర్‌`. గ‌తంలో మ‌న్మోహ‌న్ సింగ్ వ‌ద్ద మీడియా స‌ల‌హాదారుగా ప‌నిచేసిన సంజ‌య్ బారు రాసిన పుస్త‌కం ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకొంటోంది.

ఇదివ‌ర‌కే మ‌న్మోహ‌న్ సింగ్ ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన అనుప‌మ్ ఖేర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది ఆ చిత్రం యూనిట్‌.

తాజాగా- ఓ షూటింగ్ స‌న్నివేశాన్ని కూడా సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. అచ్చం మ‌న్మోహ‌న్ సింగ్‌లాగే న‌డుస్తూ, చేతులు ఊపుతూ, హావ‌భావాల‌ను ప‌లికించాడు అనుప‌మ్ ఖేర్‌. విజ‌య్ ర‌త్నాకర్ గుత్తే ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here