యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రవేశించిన ఆ వైరస్.. తొలి కేసు నమోదు..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోకి కొత్త వైరస్ ప్రవేశించినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ దీన్నే మెర్స్ వైరస్ అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వైరస్ యుఏఈలో ప్రవేశించిందని.. ఒక కేసు నమోదయిందని ధృవీకరించింది.

78 ఏళ్ల వ్యక్తి మే 4 నుండి జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే.. అతన్ని మే 13న ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. అతడు ఇటీవలే సౌదీఅరేబియాకు వెళ్ళి వచ్చాడు. అలాగే గయతిలో ఉన్న తన ఒంటెల ఫామ్ హౌస్ కు రోజూ వెళుతుంటాడని వైద్యులు తెలిపారు. ఇంకా హైపర్ టెన్షన్, ఇంటర్ స్టిషియల్ లంగ్ డిసీజ్ కూడా అతడికి ఉందని తెలిసింది. దీంతో అతడికి ‘మెర్స్’ వైరస్ సోకిందని తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే అతడు స్టేబుల్ కండీషన్ లో ఉన్నాడని తెలుస్తోంది. 2018 లో యుఏఈలో నమోదైన మొదటి మెర్స్ కేసుగా పరిగణిస్తున్నారు.

గతంలో ఈ వ్యాధి సోకి పలు దేశాల ప్రజలు చనిపోయారు. అంతేకాకుండా యుఏఈను కూడా 2012లో ఈ వైరస్ వణికించింది. అప్పుడు కూడా కొన్ని వందల మంది మరణించారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందోనని భయపడుతున్నారు అధికారులు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here