‘భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను’ అంటూ వచ్చిన భరత్ అనే నేను తొలి పాట..!

మహేష్ బాబు హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భరత్ అనే నేను’.. ఇప్పటికే టీజర్ కు మంచి స్పందన వచ్చింది. యుట్యూబ్ లైక్ లలో రికార్డులు కూడా సాధిస్తోంది. అయితే ఈరోజు ఉదయం పది గంటలకు ఈ చిత్రం లోని పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ‘విరచిస్తా నేడే నవశకం’ అంటూ సాగే పాటను యూ ట్యూబ్ లో పోస్ట్ చేశారు. మహేష్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. డేవిడ్ సైమన్ ఈ పాటను పాడారు. రామజోగయ్య శాస్త్రి తన కలంతో అద్భుతమైన లిరిక్స్ ను రాశారు. రాక్ స్టార్ డీఎస్పీ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

జనవరి 26న విడుదలైన ఫస్ట్‌ వోథ్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహేష్ వాయిస్ ఇప్పటికే రింగ్‌టోన్స్, కాలర్ ట్యూన్స్‌గా సందడి చేస్తుండగా.. ఈ మూవీ సాంగ్స్‌ను ఒక్కొక్కటిగా విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది చిత్రయూనిట్. అందులో భాగంగానే మొదటిపాటను ఈరోజు విడుదల చేశారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. ఏప్రిల్ 20న భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here