ప్చ్‌! ఒకటో త‌ర‌గ‌తి చ‌దివే పిల్ల‌వాడు కూడా.. ఆత్మ‌హ‌త్య‌! అస‌లా ఆలోచ‌న ఎలా వ‌చ్చిందో!

విజ‌య‌పుర‌: ఒక‌టో త‌ర‌గ‌తి చ‌దివే పిల్ల‌వాడు కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న ఇది. విచిత్రాల్లోకెల్లా విచిత్ర‌మ‌నిపించే ఘ‌ట‌న‌. అస‌లా ఆలోచ‌న ఎలా వచ్చిందో కూడా అర్థం కాని విష‌యం.

ఒక‌టో త‌ర‌గ‌తి చ‌దివే అయిదున్న‌రేళ్ల బాలుడు చెట్టుకు ఉరి వేసుకుని మ‌రీ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌పుర జిల్లా సింద‌గి ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. ఆ పిల్ల‌వాడి పేరు ప్ర‌కాశ్ సింగ్ సిద్ధ‌రామ సింగ్ జ‌మేదార్‌.

వ‌య‌స్సు ఆరేళ్లు కూడా నిండ‌లేదు. సింద‌గి ప‌ట్ట‌ణంలోని ష‌ణ్ముఖేశ్వ‌ర ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ఒక‌టో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఉద‌యం పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోని చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో ఆ బాలుడి మృత‌దేహాన్ని గుర్తించారు తోటి విద్యార్థులు.

ఆ బాలుడు ఈ నిర్ణ‌యం తీసుకోవడానికి గ‌ల కార‌ణ‌మేంటో తెలియ‌రావ‌ట్లేదు గానీ పోలీసులు అనుమానాస్ప‌ద మృతి కింద కేసు న‌మోదు చేశారు.

అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామ‌ని, ఆరేళ్ల పిల్ల‌వాడికి ఆత్మ‌హ‌త్య చేసుకునేంత‌టి క‌ష్టాలు ఏముంటాయ‌ని త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here