ఎర్ర‌టి ఎండ‌లో, కారు బోనెట్ మీద చేప‌ల ఫ్రై! సూప‌ర్ టేస్ట్ అట‌!

ఎండ మండిపోతున్న రోజుల్లో మ‌నవాళ్లు ఏం చేస్తారు? ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియ‌జేయ‌డానికి న‌డిరోడ్డు మీద లేదా అరుగు మీద గుడ్ల‌ను వేసి ఆమ్లెట్ త‌యారు చేస్తారు. ఇలాంటి దృశ్యాలు దాదాపు అన్ని వేస‌వి కాలాల్లోనూ మ‌నం చూస్తుంటాం. చైనాలో కూడా అంతే. చైనీయులు కూడా మాడు ప‌గిలే ఎండ‌ను అనుభ‌విస్తున్నారు.

 

 

దాన్నుంచి త‌ప్పించుకోవ‌డానికి నానా ర‌కాల మార్గ‌ల‌ను అనుస‌రిస్తున్నార‌నుకోండి అది వేరే విష‌యం. భ‌గ‌భ‌గ‌మంటూ మండిపోతున్న ఎండ‌ను ఎందుకు వృధాగా పోనివ్వ‌డమ‌ని అనుకుందో, ఏమో గానీ ఓ యువ‌తి.. చేప‌ల‌ను వేయించుకుంది. త‌న కారు బోనెట్‌పై కొన్ని చేప‌ల‌ను ఫ్రై చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను చైనాలోని పీపుల్స్ డెయిలీ.. త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని బిన్ఝౌలో క‌నిపించిందీ దృశ్యం.

 

గురువారం బిన్ఝౌలో 40 డిగ్రీల‌కు పైగా ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. దీని దెబ్బ‌కు జ‌నం అల్లాడిపోయారు. ఎర్ర‌టి ఎండ‌లో ఓ యువ‌తి గొడుగు తీసుకుని మ‌రీ.. కారు బోనెట్ మీద చేప‌ల‌ను ఫ్రై చేస్తూ క‌నిపించింది. నూనెలో వేయించిన వాటి కంటే ఇలా ఎండ‌లో, బోనెట్ మీద ఫ్రై చేసిన చేప‌లే చాలా టేస్ట్ ఇచ్చాయ‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here