మెద‌క్‌లో కూడా! ఈత‌కు వెళ్లి అయిదుమంది జ‌ల‌స‌మాధి

మెద‌క్‌: న‌ల్ల‌గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న పెండ్లిపాకల రిజ‌ర్వాయ‌ర్‌లో ఈత‌కు వెళ్లిన అయిదుమంది చిన్నారులు మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న‌ను విస్మ‌రించ‌క‌ముందే.. అలాంటిదే మ‌రో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌రో అయిదుమంది చెరువులో ఈత‌కు వెళ్లి జ‌ల‌స‌మాధి అయిన ఉదంతం మెద‌క్ జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని కౌడిపల్లి మండలం కన్నారంలో ఈతకు వెళ్లిన అయిదుగురు పెద్ద చెరువులో మునిగి మ‌ర‌ణించారు. వారిని ఇంతియాజ్, మహ్మద్‌ హఫీజ్, అహమ్మద్‌ అలీ, ఇషాక్‌ అలీ, హుదాగా గుర్తించారు. ఆదివారం ఉదయం ఈత కొట్ట‌డానికి కన్నారం శివార్ల‌లోని పెద్ద చెరువుకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ అందులో పడి మృతి చెందారు.

సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను నర్సాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ‌లో ఒకే త‌ర‌హా ఘ‌ట‌న‌లో ప‌దిమంది మ‌ర‌ణించ‌డం ఆయా ప్రాంతాల‌ను విషాదంలో నింపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here