వారి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల్లో డబ్బంతా మాయమవుతోందట..!

ఒకటేసారే బ్యాంక్ లో దాచుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల్లో ఉన్న డబ్బంతా మాయమైపోతూ వచ్చింది. దీంతో ఖాతాదారుల్లో టెన్షన్ పెరగదా ఏంటి.. దీంతో రోడ్డు మీదకు వచ్చారు ఖాతాదారులు. అలాగని ఏదో చిన్న పొరపాటు జరిగి ఉంటుందిలే అని అనుకొని.. బ్యాంకు వాళ్ళే తప్పును సరిదిద్దుతారు అని అనుకుంటే అది కూడా తప్పే.. ఎందుకంటే ఏకంగా 40 మంది అకౌంట్ల నుండి డబ్బు మాయమైంది. ఇంతకూ ఈ ఘటన ఎక్కడ జరిగిందనే కదా.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఆజిజ్‌నగర్ దక్కన్ గ్రామీణ బ్యాంకులో..!

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఆజిజ్‌నగర్ దక్కన్ గ్రామీణ బ్యాంక్ లోని సుమారు 40 మందికి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల్లో నగదు మాయం అయిందని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళనలకు దిగారు. ఆ బ్యాంకులో మొత్తం మూడు కోట్ల రూపాయలు మాయం అయినట్లు తెలుస్తోంది. ఖాతాదారుల డబ్బులు మాయం అయిన విషయంపై సంబంధిత అధికారులు మాత్రం వారికి సరైన వివరం ఇవ్వలేదు. దీంతో ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here