కేవలం 5,000 రూపాయలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి భారత్ కు వచ్చేయచ్చు..!

కొన్ని కొన్ని సార్లు మనం అసలు ఊహించనతువంటి ఆఫర్లను విమానయాన సంస్థలు ప్రకటిస్తూ ఉంటాయి. మన దేశంలో మాత్రమే కాకుండా పక్క దేశాల్లో కూడా ఇలాంటి ఆఫర్లు ఇస్తూ ఉంటారు. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న భారతీయులకు ఓ మంచి ఆఫర్ ను ప్రకటించింది ‘ఎయిర్ అరేబియా’ విమానయాన సంస్థ. కేవలం 274 దిర్హాంలతో అంటే భారత కరెన్సీలో దాదాపు 5000 రూపాయలతో భారత్ కు వచ్చేయచ్చట.

షార్జా నుండి తిరువనంతపురం కు 274దిర్హాంల ఫ్లైట్ ఛార్జీని నిర్ణయించింది ఆ సంస్థ..! ఇక కొచ్చికి అయితే 280 దిర్హాంలు, కోయంబత్తూర్ కు అయితే 350 దిర్హాంలు.. బెంగళూరుకు అయితే 345 దిర్హాంలే నని సంస్థ ప్రకటించింది. మిగతా ఎయిర్ లైన్స్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ..! ఈ ఆఫర్ అతి తక్కువ రోజులే ఉంటుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే మరిన్ని దేశాలకు కూడా ఈ ఎయిర్ లైన్స్ అతి చవక ధరకే విమానయానాన్ని అందించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here