ప‌క్షులు శ‌బ్దం చేస్తున్నాయ‌ని.. భారీ చెట్టును న‌రికేశారు: రోడ్డు మీదంతా పిల్ల ప‌క్షుల మృత‌దేహాలు

అదో ప్ర‌భుత్వ కార్యాల‌యం. కావేరీ నీటిపారుద‌ల విభాగానికి సంబంధించిన కార్యాల‌యం అది. ఆ కార్యాల‌య భ‌వ‌నాన్ని నిర్మించ‌క ముందు నుంచీ ఓ భారీ వృక్షం అక్క‌డుంది.

 

కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఉండే ఆ వృక్షంపై వంద‌లాది ప‌క్షులు నివ‌సిస్తున్నాయి. గూళ్లు క‌ట్టుకుని త‌ల‌దాచుకుంటున్నాయి. క‌నీసం 500 ప‌క్షులు అక్క‌డ నివ‌సిస్తున్నాయ‌ని స్థానికులు చెబుతున్నారు.

ఆహారం కోసం పెద్ద ప‌క్షులు వెళ్లిపోగా.. వాటి పిల్లలు చెట్టుపైనే ఉంటూ సంద‌డి చేస్తుంటాయి. ఆ సంద‌డి ఆ ప్ర‌భుత్వ కార్యాల‌యం అధికారుల‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేదు.

పైగా.. వాటి నుంచి దుర్వాస‌న వ‌స్తోంద‌నే కార‌ణంతో..అంత పెద్ద, ఎన్నో ఏళ్లుగా ఉన్న చెట్టును నేల కూల్చారు. ఆ వృక్షాన్ని నరికేశారు. ఫ‌లితంగా.. ప‌క్షులకు నిలువ‌నీడ లేకుండా పోయింది. క‌న్ను తెర‌వ‌క‌ముందే కొన్ని పిల్ల ప‌క్షులు మ‌ర‌ణించాయి.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మండ్య జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కేఆర్ పేటలో ఉన్న కావేరీ నీటి పారుద‌ల శాఖ కార్యాల‌యంలో ఉన్న ఈ చెట్టును నరికేయ‌డానికి ముందు.. క‌నీసం వాటి గూళ్లను జాగ్ర‌త్త‌గా తొల‌గించి ఉన్నా బాగుండేది.

ఎందుకంటే.. అందులో ఉన్న గుడ్లు, పిల్ల ప‌క్షులు బతికేవి. అలా చేయ‌లేదు. వృక్షాన్ని న‌రికేయ‌డంతో గుడ్లు ప‌గిలిపోయాయి. పిల్ల ప‌క్షులు మ‌ర‌ణించాయి.

పూర్తిగా పొద‌గ‌క ముందే గుడ్లు ప‌గిలిపోవ‌డంతో.. వాటిల్లో పిల్ల ప‌క్షులు క‌న్ను తెర‌వ‌క ముందే మ‌ర‌ణించాయి. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు పెద్ద ఎత్తున అక్క‌డికి చేరుకున్నారు.

కొంద‌రు చిన్న‌పిల్ల‌లు ఆ ప‌క్షుల‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు. కొస ప్రాణాల‌తో ఉన్న పిల్ల ప‌క్షుల‌ను సంర‌క్షించారు. ఆ పిల్ల ప‌క్షులు ప‌డుతున్న న‌ర‌క యాత‌న‌ను చూసి.. చిన్నారులు క‌న్నీరు పెట్టుకోవ‌డం స్థానికుల‌ను క‌దిలించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here