అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ బుష్ భార్య క‌న్నుమూత‌: అక్క‌డే ట్విస్ట్

న్యూయార్క్‌: అమెరికా పూర్వ‌ ప్ర‌థ‌మ మ‌హిళ‌, అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ భార్య బార్బ‌రా బుష్ క‌న్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 92 సంవ‌త్స‌రాలు. టెక్సాస్‌లోని హ్యూస్ట‌న్‌లో సొంత నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. త‌న కుమారుడు, అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్‌తో క‌లిసి ఆమె హ్యూస్ట‌న్‌లో నివ‌సిస్తున్నారు.

అక్క‌డే ఓ షాకింగ్ ట్విస్ట్ ఉంది. అనారోగ్యంతో బార్బ‌రా బుష్ మ‌ర‌ణించిన‌ట్టు సీబీఎస్ న్యూస్ అనే వెబ్‌సైట్ రెండురోజుల ముందే వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఆదివారం ఆ వెబ్‌సైట్ ఓ క‌థ‌నాన్ని రాసింది. ఈ కథ‌నం వెలువ‌డిన వెంట‌నే జార్జ్‌బుష్ స్పందించారు. బార్బ‌రా బుష్ మ‌ర‌ణించలేద‌ని అంటూ ఓ ప్రెస్ రిలీజ్ ఇచ్చారు.

అప్ప‌టికి ఆమె జీవించే ఉన్నారంటూ కొన్ని ఫొటోల‌ను కూడా విడుద‌ల చేశారు. దీనితో సీబీఎస్ న్యూస్ వెబ్‌సైట్ క్ష‌మాప‌ణ‌లు కోరుతూ ఇంకో క‌థ‌నాన్ని రాసింది. ఇది జ‌రిగిన 48 గంటల్లోనే బార్బ‌రా బుష్ మ‌ర‌ణించడం కాక‌తాళీయంగానే జ‌రిగింద‌ని అనుకోవ‌చ్చు. బార్బ‌రా బుష్ మ‌ర‌ణం ప‌ట్ల అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, మాజీ అధ్య‌క్షుడు బార‌క్ ఒబామా సంతాపం ప్ర‌క‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here