ప‌దేళ్ల బాలిక‌పై పాడుప‌ని చేయ‌బోయి..

బాగ‌ల్‌కోటె: ప‌దేళ్ల బాలిక‌పై పాడుప‌ని చేయ‌బోయిన ఓ వ్య‌క్తిని స్థానికులు దొర‌క‌బుచ్చుకుని దేహ‌శుద్ధి చేశారు. పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బాగ‌ల్‌కోటె జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడి పేరు మౌలా సాబ్‌. మున్సిపాలిటీ మాజీ స‌భ్యుడు.

జిల్లాలోని బ‌న‌హ‌ట్టి ప‌ట్ట‌ణం అశోక్‌న‌గ‌ర కాల‌నీలో నివాసం ఉంటున్నాడు. అశోక్‌న‌గ‌ర కాల‌నీలోని త‌న ఇంటికి ప‌దేళ్ల బాలిక‌ను తీసుకొచ్చి, అత్యాచార‌య‌త్నం చేశాడు.

ఈ విష‌యం తెలిసిన వెంట‌నే బాలిక తల్లిదండ్రులు, స్థానికులు మౌలాసాబ్ ఇంటికి చేరుకుని, అత‌నికి దేహ‌శుద్ధి చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ఏబీవీపీ ప్ర‌తినిధులు బ‌న‌హ‌ట్టి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. మౌలాసాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక‌ను సుర‌క్షితంగా త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here