కనీసం నడవలేని స్థితిలో సనత్ జయసూర్య.. ఏమైంది..!

ఒకప్పుడు బౌలర్లను ఊచకోత కోసిన శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్యను క్రికెట్ ప్రేమికులు ఎవరూ మరచిపోలేరు. అలాంటి సనత్ జయసూర్య ఇప్పుడు కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. ఆయన ఆసరాకు ఏవైనా ఉంటేనే నడవగలుగుతున్నాడు.

ప్రస్తుతం సనత్ జయసూర్య ఆరోగ్యం ఏమంత బాగోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 48సంవత్సరాల జయసూర్య గత కొద్దికాలంగా మోకాలు నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఆయన కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. ఆసరాగా క్రచెస్ ఉంటేనే నడవగలుగుతూ ఉన్నాడు. ఆయన త్వరలోనే సర్జరీ చేయించుకోబోతున్నాడు. త్వరలో ఆస్ట్రేలియా కు వెళ్ళబోతున్న సనత్ జయసూర్య అక్కడ సర్జరీ సక్సెస్ అయితే ఎటువంటి ఇబ్బందులూ లేకుండా నడవగలుగుతారు.

జయసూర్య తన కెరీర్ లో ఎన్నో రికార్డులు సాధించాడు. 98 టెస్టుల్లో 6973 పరుగులు చేసిన జయసూర్య.. వన్డేల్లో ఏకంగా 13430 పరుగులు సాధించాడు. అలాగే 323వన్డే వికెట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆధునిక క్రికెట్ లో ఓపెనర్ కు అసలు సిసలు అర్థం తెలిపింది జయసూర్యనే..! క్రికెట్ నుండి రిటైర్ అయ్యాక సనత్ జయసూర్య శ్రీలంక క్రికెట్ బోర్డులో పని చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here