పిల్లలను చూసుకోమని అతడి దగ్గర వదిలి వెళ్ళింటే 919 మందిపై అత్యాచారం చేశాడట..!

సాధారణంగా మనదేశాల్లో తక్కువ కానీ.. విదేశాల్లో అయితే పిల్లలను చూసుకోవడానికి కొన్ని సెంటర్లు ఉంటాయి. అలా చూసుకునే ఓ వ్యక్తి తీవ్రమైన నేరాలను చేశాడు. ఏకంగా 900 మంది పైగా అమ్మాయిలపై అత్యాచారం చేశాడు.

రష్యాకు చెందిన విక్టర్ లిషావ్ స్కీ అనే వ్యక్తి ఈ ఘోరాలకు పాల్పడ్డాడు. అతడు ఫాస్టర్ పేరెంట్ గా ఉండేవాడు. అతడి దగ్గరికి పలువురు పిల్లలను ఉంచి వెళ్ళేవారు. అయితే వారిని రేప్ చేయడం అలవాటు చేసుకున్నాడు విక్టర్. ఇటీవలే అతడిపై ఫిర్యాదు అందగా 34సంవత్సరాల విక్టర్ దాదాపు 919 మందిని రేప్ చేశాడని అభియోగాలు మోపబడ్డాయి. ఒక అమ్మాయి తన టీచర్ కు ఇలా తనపై అత్యాచారం జరిగిందని చెప్పింది. దీంతో విక్టర్ ను గత జూన్ లో అరెస్ట్ చేశారు.

Viktor Lishavsky

అయితే ఇప్పుడు అతడి గురించి పూర్తీ వివరాలు బయటకు వచ్చాయి. అతడు చాలా మంది అమ్మాయిలను బెదిరించి అత్యాచారం చేసే వాడట. చిన్న చిన్న పిల్లలపై కూడా అతడు తన కామవాంఛలను తీర్చుకునేవాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 13 సంవత్సరాల లోపల వయసు గల అమ్మాయిలపై కూడా అత్యాచారానికి తెగబడ్డాడు. అతడికి పెళ్ళి అయి.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వారికి ఈ విషయాలు ఏవీ తెలీకుండా విక్టర్ ఇన్నాళ్ళూ గడిపాడు. త్వరలో అతడికి శిక్ష విధించనున్నారు. మొత్తం 919 మందిపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here