నాలుగు ఏనుగులు.. రైల్వే ట్రాక్ దాటుతుండగా..!

ఏనుగుల సమూహం రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు అతి వేగంగా వచ్చింది. ఈ ప్రమాదంలో ట్రాక్ మీద ఉన్న ఏనుగులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఏకంగా నాలుగు ఏనుగులు దుర్మరణం పాలయ్యాయి. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రం లోని ఝార్సుగూడ ప్రాంతంలో చోటుచేసుకుంది.

సోమవారం ఉదయం బాగ్ దిహి ఫారెస్ట్ రేంజ్ ప్రాంతంలో ఉన్న తెలాదిహా రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మొత్తం నాలుగు ఏనుగులు చనిపోయాయి. ఒక మగ ఏనుగు, రెండు ఆడ ఏనుగులు, ఒక గున్నేనుగు చనిపోయాయి. సోమవారం ఉదయం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుందని రైల్వే అధికారులు వెల్లడించారు. తినడానికి ఏదైనా దొరుకుతాయని ఆ ఏనుగులు రైల్వే ట్రాక్ వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. తెల్లవారు జామున 4 గంటలకు ఈ ఘటన జరుగగా.. 8 వరకూ రైల్వే ట్రాక్ మీదనే వాటి మృతదేహాలు పడి ఉన్నాయి. దీంతో రూర్కేలా-ఝార్సుగూడ మధ్య రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగింది. అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత వాటిని ట్రాక్ మీద నుండి తప్పించడంతో రైళ్ళ రాకపోకలు జరిగాయి.

ఒరిస్సా రాష్ట్రం లోని చాలా ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ లకు అడ్డంగా రావడం వలన ఏనుగులు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాయి. వాటికి గాయాలు అవ్వడమే కాకుండా ఎక్కువగా మరణిస్తూ ఉన్నాయి..2000 నుండి 2013 మధ్య ప్రాంతంలో ఏకంగా 16 ఏనుగులు రైలు ప్రమాదాల్లో మరణించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here