మ‌ట్టి పెళ్ల‌ల కింద కూరుకుపోయిన మ‌హిళ‌ల మృత‌దేహాలు! అక్క‌డికి ఎందుకెళ్లారంటే..?

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బైతుల్ జిల్లాలో అక్ర‌మ బొగ్గు గ‌నుల త‌వ్వ‌కాల సంద‌ర్భంగా మ‌ట్టిపెళ్ల‌లు విరిగిన ప‌డిన ఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌హిళ‌లు, 11 సంవ‌త్స‌రాల బాలిక దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

జిల్లాలోని సార‌ణిలో ఆదివారం మ‌ధ్యాహ్నం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఒక‌ర్ని స్థానికులు ప్రాణాల‌తో కాపాడారు. సార‌ణి చుట్టుప‌క్క‌ల గ‌తంలో బొగ్గు గ‌నులు ఉండేవి.

బొగ్గు త‌వ్వ‌కాలు పూర్త‌యిన త‌రువాత ప్ర‌భుత్వం వాటిని మూసివేసింది. అయిన‌ప్ప‌టికీ..అక్క‌డ అక్ర‌మ త‌వ్వ‌కాలు య‌థేచ్ఛ‌గా కొన‌సాగుతున్నాయి.

కొంద‌రు కాంట్రాక్ట‌ర్లు స్థానికుల‌కు డ‌బ్బు ఆశ చూపి.. తవ్వ‌కాల్లో పాల్గొనేలా చేస్తారు. డ‌బ్బు కోసం స్థానికులు, మ‌హిళ‌లు న‌ల్లరాతి గ‌నుల్లో అక్ర‌మ త‌వ్వ‌కాలను సాగిస్తుంటారు.

ఆదివారం కూడా ఇలాంటి సంద‌ర్భంలోనే మ‌ట్టి పెళ్ల‌లు విరిగిపడ్డాయి. ప్ర‌మాదం సంభ‌వించిన వెంట‌నే స్థానికులు స్పందించారు. ఓ మ‌హిళ‌ను ప్రాణాల‌తో కాపాడారు.

పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అంబులెన్స్‌ను ర‌ప్పించారు. ప్రొక్లెయిన‌ర్లను తెప్పించి, మ‌ట్టి పెళ్ల‌ల‌ను త‌వ్వారు. వాటి కింద చిక్కుకుపోయిన మృత‌దేహాల‌ను వెలికి తీశారు.

మృతుల‌ను సీలూ ఛోర్సీ, మీనా బోర్సీ, నాని బాయి, 11 ఏళ్ల పాయ‌ల్‌గా గుర్తించారు. వెస్ట‌ర్న్ కోల్‌ఫీల్డ్స్‌కు చెందిన బొగ్గు గ‌నులు అవి. త‌వ్వ‌కాలు పూర్తయిన త‌రువాత వాటిని అధికారులు మూసివేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here