శృంగారానికి కనీస వయసు ప్రతిపాదించిన ప్రభుత్వం..!

ఆ కొత్త రూల్ పెట్టింది మన దేశ ప్రభుత్వం కాదు లేండి.. ఫ్రాన్స్ ప్రభుత్వం. ఆ దేశంలో చాలా ఏళ్లుగా చిన్న చిన్న పిల్లలతో కూడా శృంగారంలో పాల్గొంటూ ఉన్నారు. గతంలో ఈ విషయమై ఎన్నో కేసులు కూడా నడిచాయి. తాజాగా కూడా 11ఏళ్ల అమ్మాయిలతో కొందరు పురుషులు శృంగారంలో పాల్గొనడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై అక్కడి ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో కోప్పడింది. అందుకే కొత్త చట్టం ప్రవేశపెట్టి పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనాలన్నా కనీస వయసు 15 సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్‌లో ఇలాంటి చట్టం రానుండటం ఇదే మొదటిసారి.

11 ఏళ్ల మైనర్లతో శృంగారం చేసినట్లు పురుషుపై ఆరోపణలు వచ్చాయి. ఆ అమ్మాయిల ఇష్టంతోనే చేశామని.. ఫ్రెంచ్ చట్టం ప్రకారం ఇది సమ్మతమేనన్న భావనతో వారు ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే శృంగారానికి కనీస వయసును ప్రతిపాదించిన ప్రభుత్వం. అంతకుముందు ఈ వయసును 13 ఏళ్లుగా నిర్ణయించాలని అధికారులు చర్చించారు. దేశాధ్యక్షుడు ఎమాన్యువల్ మేక్రాన్ తో పాటుగా పలువురు ఈ వయసు అంతకంటే కాస్త ఎక్కువగా ఉంటే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజా ప్రతిపాదనకు సంబంధించిన బిల్లును ఈ నెలాఖర్లో పార్లమెంటుకు నివేదించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here