మూడేళ్ల కుమారుడితో చిరుత‌ల‌ను ఒట్టి చేతుల‌తో అదిలించింది..!

స‌ఫారీకి వెళ్లడానికి ముందు.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కారు వాహ‌నం నుంచి కిందికి దిగొద్ద‌ని సూచిస్తారు అక్క‌డి సిబ్బంది. ఈ మాట‌ల‌ను సంద‌ర్శ‌కులు వినీ, విన‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తారు. స‌ఫారీ చేస్తున్న స‌మ‌యంలో.. అక్క‌డ క‌నిపించిన వ‌ణ్య ప్రాణుల‌ను చూసి.. ఎలాగూ కిందికి దిగ‌రు. సింహాలు, చిరుత‌లు ఉండే స‌ఫారీలో కారు దిగే సాహ‌సం చేసిందో కుటుంబం.

భార్య‌, భ‌ర్త అయితే ఫ‌ర్లేదు. మూడేళ్ల కుమారుడిని చంక‌లో పెట్టుకుని మ‌రీ స‌ఫారీ మ‌ధ్య‌లో కారు దిగింది. అలా దిగి- సెల్ఫీల కోసం ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో దూసుకొచ్చాయి రెండు చిరుత‌లు. ఆ కుటుంబాన్ని వెంటాడాయి. చివరి నిమిషంలో వారు కారు ఎక్కి త‌ప్పించుకోగలిగారు. ఈ ఘ‌ట‌న నెద‌ర్లాండ్‌లో చోటు చేసుకుంది. బీక్సె బ‌ర్గెన్ స‌ఫారీ పార్క్ అది.

ఓ వ్య‌క్తి, త‌న భార్య మూడేళ్ల కుమారుడితో కలిసి స‌ఫారీ మ‌ధ్య‌లో కారు దిగాడు. సెల్ఫీ కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. రెండు చిరుత‌లు దూసుకొచ్చాయి. ఆ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. భ‌ర్త ముందుకు ప‌రుగెత్త‌గా.. అత‌ని భార్య త‌న మూడేళ్ల కుమారుడిని ఎత్తుకుని కారు వైపు అడుగులు వేసింది.

ఆ స‌మ‌యంలో ఆమె ఒట్టి చేతుల‌తో చిరుత‌ల‌ను అదిలిస్తూ క‌నిపించింది. ఏ మాత్రం ఏమ‌రుపాటుగా ఉన్నా చిరుత‌ల‌కు బ‌ల‌య్యేవారే. వారి వెనుక ఇంకో కారులో వ‌స్తున్న ఓ సంద‌ర్శ‌కుడు దీన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైర‌ల్‌లా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here