గ్లాసుతో తల పగులగొట్టుకున్న ప్రియాంక..!

ప్రియాంక చోప్రా తన ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం ఓ వీడియో అప్లోడ్ చేసింది. ఆ వీడియోలో ఏముందంటే ప్రియాంక చోప్రా.. తన తలపై వైన్ గ్లాస్‌ను పగలగొట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరైనా మానసికంగా ఒత్తిడితో ఉంటే… డైవర్ట్ అవ్వడానికి వేరే పనులు చేస్తుంటారు. ప్రియాంక కూడా అలానే చేసింది. ఏమంటే అది కాస్తా కామెడీగా..!

మ్యూజిక్‌తో కూడా ప్రియాంకకు కాస్త చిరాకు వచ్చింది. ఇక ఒత్తిడిని తట్టుకోలేక… వైన్ గ్లాస్ తీసుకొని తలపై కొట్టుకుంది. ఉదయం తొమ్మిది నుంచి వైన్ టైం వరకు వర్క్ చేస్తే ఇలాగే జరుగుతుంది… మీరు మాత్రం ఇంట్లో ప్రయత్నించకండి… అప్పుడప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాను అంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షాకింగ్ వీడియోను షేర్ చేసింది. సాధారణంగా సినిమాల్లో పట్టుకోగానే పగిలిపోయే అద్దాలు ఉంటాయి కదా దానితో ప్రియాంక తల మీద కొట్టుకుంది అంతే.. ఇదంతా క్వాంటికో సెట్స్ లో జరిగింది.

https://www.instagram.com/p/BfiyCvAgixh/?taken-by=priyankachopra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here