ఢిల్లీ కెప్టెన్ గా తప్పుకున్న గంభీర్..!

ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ పదవి నుండి తప్పుకున్నాడు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ గా నియమించింది ఢిల్లీ. గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న గంభీర్ అద్భుతంగా రాణించి.. రెండు ఐపీఎల్ కప్ లు అందించాడు. కానీ ఈ ఏడాది వేలంపాటలో ఢిల్లీ యాజమాన్యం గంభీర్ ను రెండు కోట్లకు తీసుకుంది. ఏకంగా కెప్టెన్ గా నియమించింది. అయితే అనూహ్యంగా ఇప్పుడు గంభీర్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడం షాకింగ్ గా అనిపిస్తోంది.

గంభీర్ కెప్టెన్ గా ఈ సీజన్ లో ఢిల్లీ చాలా ఘోరంగా ఆడుతోంది. ఆడిన ఆరు మ్యాచ్ లలో అయిదు మ్యాచ్ లు ఢిల్లీ జట్టు ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. గంభీర్ మొదటి మ్యాచ్ లో బాగా ఆడి హాఫ్ సెంచురీ చేసినప్పటికీ తర్వాతి మ్యాచ్ లలో ఘోరంగా విఫలమయ్యాడు. గంభీర్ ఫెయిల్యూర్ కూడా జట్టుపై ప్రభావం చూపింది. అయితే గంభీర్ సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నాడా.. లేక యాజమాన్యం చేసిందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్ గా ఉన్న పాంటింగ్ సూచన మేరకే శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ గా నియమించినట్లు తెలుస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here