గీత గోవిందం ఆడియో విడుద‌ల‌ 

విజయ్‌ దేవరకొండ, రష్మిక మండన్న హీరో హీరోయిన్లుగా.. అల్లు అరవింద్‌ సమర్పణలో జి.ఎ 2 పిక్చర్స్‌ బ్యానర్‌పై పరుశురాం దర్శకత్వంలో బన్నివాసు నిర్మిస్తోన్న చిత్రం ‘గీత గోవిందం’. గోపీసుందర్‌ సంగీతం అందించిన ఈసినిమా పాటలను  హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా…

బ‌న్ని వాసు కోస‌మే…
స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మాట్లాడతూ – ‘బన్ని వాసుకోసమే ఈ వేడుకకి వచ్చాను. నా కెరీర్‌ బిల్డింగ్‌లో మా నాన్నగారి సపోర్ట్‌ ఎంత ఉంటుందో.. బన్నివాసుది. రెండు సంవత్సరాలు క్రితం కథ విన్నాను. రీసెంట్‌గా సినిమా చూశాను. విజయ్‌, రష్మిక రాక్‌ ది షో. సినిమా చాలా బావుంది. గోపీసుందర్‌గారు అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. ఎన్నో సినిమాలకు తన మ్యూజిక్‌తో ప్రాణం పోసిన గోపీసుందర్‌గారు ఈ సినిమాకు మరోసారి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. పరుగు సినిమా సమయంలో పరుశురాంగారిని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చూశాను. ఆయన ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ డైరెక్టర్‌గా ఎదిగారు. ఆయన కెరీర్‌లో ఇది బెస్ట్‌ మూవీ అవుతుందని చెప్పారు.

 

కచ్చితంగా పెద్ద సక్సెస్‌ అవుతుంది- అల్లు అరవింద్‌ 
ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత అర్జున్‌రెడ్డి విడుదలైంది.. యూనిట్‌ అంతా కాస్త కంగారు పడి మాట్లాడుకున్నాం. ఈ హీరోతో ఇలాంటి క్యారెక్టర్‌ చేయించడం బావుంటుందా? అనుకునన్నాం. అయితే అర్జున్‌రెడ్డిని చూసి కంగారు పడి ఓ లైన్‌ కూడా మార్చొద్దు అనుకున్నాం. అదే ఈ సినిమా సక్సెస్‌ అవుతుంది. అందుకు కారణం విజయ్‌ దేవరకొండే. విజయ్‌ నైస్‌ జెంటిల్‌మెన్‌. రష్మిక రాక్‌డ్‌ ఇన్‌ ది మూవీ. పరుశురాం గురించి నేను ప్రత్యేకంగా ఏదీ చెప్పనక్కర్లేదు.  బన్నివాసు నిర్మాణ బాధ్యతలు తీసుకుని సమర్ధవంతగా పూర్తి చేశాడు. నా నమ్మకాన్ని నిజం చేశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా పెద్ద సక్సెస్‌ అవుతుంది’ అన్నారు.

నేను పాడిన పాట మ‌రో ర‌కంగా సెన్సేష‌న్ అయింది- విజ‌య్ దేవ‌రకొండ‌
విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ – ‘నేను పాడిన పాట ఏదో సెన్సేషనల్‌ అవుతుందనుకుంటే.. మరో రకంగా సెన్సేషన్‌ అయింది. అందరూ నన్ను, మా లిరిక్‌ రైటర్‌ను తిట్టారు. సరే..ప్రేక్షకులు ఈ పాటను పాడి పంపితే.. ఎవరి గొంతు బావుంటుందో వారితోనే ఈ పాటను పాడిస్తాం’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here