ఓనర్ ను కాపాడడానికి మూడు బుల్లెట్లు తగిలించుకున్న కుక్క..!

మనుషులతో పోల్చుకుంటే జంతువుల్లోనే విశ్వాసం ఎక్కువ అంటారు. ఇక కుక్కల విషయమైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓనర్ల కోసం ఏమి చేయడానికైనా ముందుగా ఉంటాయి. ప్రాణాలు కాపాడడంలో కూడా ఎప్పుడూ ముందుంటాయి. తాజాగా ఓ జర్మన్ షెపర్డ్ కుక్క దుండగుల నుండి తన యజమానిని కాపాడడానికి ఏకంగా మూడు బులెట్లు తగిలించుకుంది.

16 సంవత్సరాల జేవియర్ చాలా రోజుల నుండి జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటూ ఉన్నాడు. దానికి రెక్స్ అనే పేరు కూడా పెట్టాడు. అమెరికా.. వాషింగ్టన్ లోని డెన్ మోయినెస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడు ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు అతడి ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నించాడు. ఇంతలో భయపడిపోయిన జేవియర్.. పైనకు వెళ్ళి దాక్కున్నాడు. కానీ రెక్స్ మాత్రం దుండగులను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఇంతలో పైన ఉన్న జేవియర్ పోలీసులకు సమాచారం అందించాడు.

ఇద్దరు దుండగులు కలిసి రెక్స్ ను వారి వద్ద ఉన్న ఆయుధాలతో కొట్టారని జేవియర్ ఆంటీ సూసీ తెలిపింది. ఆ తర్వాత కూడా జేవియర్ కోసం రెక్స్ పైనకి వెళ్లిందట. మరో సారి కూడా దుండగుల మీదకు దుమికింది రెక్స్.. ఈసారి ఆ ప్రయత్నంలో మూడు బులెట్లు రెక్స్ శరీరంలోకి దూసుకుపోయాయి. పోలీసులు సైరన్లు విన్న దుండగులు వెంటనే అక్కడి నుండి పారిపోయారు. వెంటనే రెక్స్ ను ఆసుపత్రికి తరలించారు. తన కుక్క చేసిన సాహసాన్ని జేవియర్ ఫాక్స్ ఛానెల్ లో చెప్పుకున్నాడు కాను.. అంతేకాదు రెక్స్ సర్జరీకి కావాల్సిన 20,000 డాలర్లు వెబ్ సైట్ ద్వారా కలెక్ట్ చేశారు. ప్రస్తుతం రెక్స్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. దుండగులు ఎదురైన సమయంలో సొంత వాళ్ళు కూడా తమ ప్రాణాలు కాపాడుకోడానికే ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి ఈ మూగజీవం తన యజమాని ప్రాణాలు కాపాడాలనే నిర్ణయించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here