ఈ దుబాయ్ షాపింగ్ మాల్ కు రేపు వెళితే బంపర్ ఆఫర్లే.. షాపింగ్ చేస్తే కోటీశ్వరులు అవ్వొచ్చు..!

దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ శుక్రవారం కానీ ఈ షాపింగ్ మాల్ కు వెళ్ళారంటే అన్నీ బంపర్ ఆఫర్లే..! ఉదయం 10 గంటలకల్లా ఆ షో రూమ్ కు చేరుకోవడమే మీరు చేయాల్సిన పని.

శుక్రవారం జనవరి 19న దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ లో భాగంగా బ్యూటీ ఫ్యాన్స్ కోసం ఎమిరేట్స్ లో ఉన్న ‘వూజూ మాల్’ లో స్పెషల్ ఆఫర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఉదయం 10 గంటలకు సేల్ మొదలవుతుంది. స్టాక్స్ ఉన్నంతవరకూ కొనుక్కోవచ్చునని నిర్వాహకులు తెలిపారు. టాప్ రేంజ్ ఫౌండేషన్ క్రీముల దగ్గర నుండి.. కొత్త కొత్త సెంటు బాటిల్స్ వరకూ వూజూ మాల్ షాపింగ్ లో కొనేసుకోవచ్చు. 70శాతం భారీ డిస్కౌంట్ ను పొందవచ్చు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ జనవరి 27వరకూ కొనసాగుతుంది.

అలాగే షాపింగ్ చేసినప్పుడు ఇచ్చే కూపన్స్ ద్వారా కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. క్యాష్, గిఫ్ట్ వోచర్లు కూడా ఇవ్వనున్నారు. ప్రతి ఒక్క వస్తువు మీద కూడా 25-75శాతం డిస్కౌంట్ లభించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here