రంజాన్ స్పెష‌ల్ ఆఫ‌ర్‌! అక్క‌డ‌ ఏ వ‌స్తువు కొన్నా 90 శాతం డిస్కౌంట్‌..!

అబుధాబి: మ‌రికొద్దిరోజులు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ముస్లిం సోద‌రులు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకొనే ప‌విత్ర రంజాన్ మాసం ఆరంభం కాబోతోంది. ఈ నెల 15వ తేదీన రంజాన్ ఉప‌వాస దీక్ష రోజులు ప్రారంభ‌మౌతాయి. ఈ శుభ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లో భారీ స్థాయిలో డిస్కౌంట్ల‌ను ప్ర‌క‌టించారు.

ఏ వ‌స్తువు కొన్నా 90 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా అన్ని షాపింగ్‌మాల్స్‌, షోరూమ్‌ల య‌జ‌మానుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్టు ఎమిరేట్స్ ఎకాన‌మీ మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌పైనా ఈ డిస్కౌంట్ వ‌ర్తిస్తుంది. 90 శాతం డిస్కౌంట్ అంటే మాట‌లు కాదు. నూటికి ప‌ది రూపాయ‌ల‌ను మాత్ర‌మే చెల్లించాల్సి ఉంటుంది.

రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకుని పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ షాపింగ్ చేసుకోవాల‌ని, త‌మ‌కు అవ‌స‌ర‌మైన, ఇష్ట‌మైన వ‌స్తువుల‌ను కొనుగోలు చేయాల‌నే ఉద్దేశంతోనే ఈ డిస్కౌంట్ అమ‌ల‌య్యేలా ఆదేశాలు జారీ చేసిన‌ట్లు వినియోగ‌దారుల పరిర‌క్ష‌ణ విభాగం డైరెక్ట‌ర్‌ డాక్టర్ హ‌షీమ్ అల్ నువాయిమీ తెలిపారు. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ వ్యాప్తంగా ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంద‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here