అన్నం తింటూ ఉండగా గెటప్ శీనును బయటికి గెంటేశారట..!

ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నామో.. అక్కడే శభాష్ అని అనిపించుకోవడమే మన సక్సెస్ అని అంటారు. అలాంటిదే జబర్దస్త్ గెటప్ శ్రీను విషయంలో జరిగింది. ఇప్పుడు మోస్ట్ పాపులర్ కమెడియన్ అయిన గెటప్ శీనును ఒకప్పుడు అన్నం తింటుంటే మెడపట్టుకుని గెంటేశారట. ఈ విషయాన్ని గెటప్ శీను ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇప్పుడు ఉన్న గెటప్ శీను వేరే.. అప్పట్లో ఉన్న శీను వేరే అని చెప్పాడు. కెరియర్ తొలినాళ్లలో చాలా కష్టాలు పడ్డానని శీను చెప్పుకొచ్చాడు. ప్రొడక్షన్ లో తెలిసిన వ్యక్తి వుంటే 2007లో అన్నపూర్ణ స్టూడియోలో ఒక సినిమా షూటింగ్ చూద్దామని వెళ్ళాడు శీను. ఆ వ్యక్తి భోజనం చేయమంటేనే అందరితో కలిసి భోజనం చేస్తున్నాడట. ఇంతలో ప్రొడక్షన్ ఇంచార్జ్ అక్కడికి వచ్చి ‘ఎవడ్రా నువ్వు?’ అంటూ నా పై మండిపడ్డాడు. నేను చెప్పేది వినిపించుకోకుండా కాలర్ పట్టుకుని బయటికి గెంటేశాడని శీను చెప్పుకొచ్చాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక వారం రోజులు ఏడ్చానని శీను తన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎక్కడి నుంచి గెంటివేయబడ్డానో .. అదే స్టూడియోలో ఇప్పుడు నా షూటింగ్స్ జరుగుతున్నాయని శీను ఎంతో ఆనందంగా చెప్పాడు. అతడి టీవీ షోలు అన్నీ అక్కడే జరుగుతుంటాయి. జబర్దస్త్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లోనే జరుగుతూ ఉంటుంది. అందుకే సక్సెస్ అనేది అంత ఈజీగా ఏమీ రాదు అంటుంటారు. ఎన్నో అవమానాలు ఎదుర్కుంటేనే గొప్పవారిగా ఎదుగుతారు.

Please Share This Article With Your Friends And Groups

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here