ఒకే ఒక్క వీడియో సాక్ష్యం గజల్ శ్రీనివాస్ బండారం మొత్తం బయటకు.. చెప్పుతో కొట్టాలని ఉందన్న యువతి..!

ఒకే ఒక్క వీడియో సాక్ష్యం గజల్ శ్రీనివాస్ నిజస్వరూపాన్ని బయటపెట్టింది. అతడు తన ఆఫీస్ లో పనిచేస్తున్న మహిళతో చేసే కామకలాపాలు.. ఆ యువతిని వేధించిన వీడియోలు మొత్తం బయటకు వచ్చేశాయి. రేడియో జాకీగా ప‌నిచేసే ఓ యువ‌తిని లైంగిక‌ వేధింపుల‌కు గురి చేసిన‌ గ‌జ‌ల్ శ్రీనివాస్‌ను పోలీసులు నాంప‌ల్లి కోర్టులో హాజ‌రుప‌ర్చి చంచ‌ల్ గూడ జైలుకి త‌ర‌లించారు.

బాధిత అమ్మాయి మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్ ఓ నీచుడు, నీకృష్ణుడు అని దుయ్యబట్టారు. అమ్మాయిలందర్నీ అదే దృష్టితో చూస్తాడని తెలిపారు. గజల్ శ్రీనివాస్‌తో శరీరకంగా సంబంధం కలిగిన పనిమనిషి మీడియాకు అవాస్తవాలు చెప్పారని అన్నారు. తనను ఆఫీసులో పనిచేసుకోనివ్వకుండా వేధింపులకు గురిచేసేవాడని, ఇటీవల కాళ్లు కూడా పట్టించుకున్నాడని బాధితురాలు కన్నీటిపర్యాంతమయ్యారు. పోలీసులు గజల్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడం తనకు సంతృప్తి కలిగిందని అన్నారు. అతడ్ని తాను చెప్పుతో కొట్టాలన్న కోపంగా ఉందని ఆమె చెప్పారు. అయితే, పోలీసులు అతడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here