పాపం చెట్టు కొమ్మల్లో తల ఇరుక్కుపోయింది.. చివరికి..!

పాపం ఓ జిరాఫీ తల చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడక చనిపోయింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని యున్నాన్ ప్రావిన్స్ లో ఉన్న కున్ మింగ్ జూలో ఓ జిరాఫీ మెడ రెండు కొమ్మల మధ్య ఇరుక్కుపోయింది. చాలా సేపు ఆ జిరాఫీ అలాగే ఇరుక్కుపోవడంతో చనిపోయినట్లు తెలుస్తోంది.

హైరాంగ్ అనే 10 సంవత్సరాల వయసు గల జిరాఫీ అయిదేళ్ళ నుండి ఆ జూలో ఉంటోంది. సాధారణంగా జంతువులకు దురద పెడితే చెట్టునో, రాయినో ఆశ్రయించడం మామూలే.. అలాగే ఈ జిరాఫీ కూడా చెట్టును ఆశ్రయించింది. ఆ సమయంలో జిరాఫీ మెడ రెండు కొమ్మల మధ్య ఇరుక్కుపోయింది. కొద్దిసేపటికి ఆ విషయాన్ని గమనించిన జూ సిబ్బంది.. దాని దగ్గరకు వెళ్ళి చెట్టు కొమ్మల నుండి తలను వేరు చేశారు. ఒక కొమ్మును నరికివేసి దానికి ఉపశమనం కలిగించామని అనుకునే లోపే ఆ జిరాఫీ కాస్తా కిందకు పడిపోయింది. వెంటనే పశువుల వైద్యులు దాన్ని పరీక్షించారు. దాదాపు అయిదు గంటల పాటూ దానికి చికిత్స అందించారు. చివరికి చనిపోయిందని ప్రకటించారు జూ సిబ్బంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here