11వ తరగతి అమ్మాయి.. స్నేహితుడు రేప్ చేయడంతో..!

ఈ మధ్య కాలంలో ఏ స్నేహాలు ఎలా మారుతున్నాయో అసలు అర్థం కావడం లేదు. 11వ తరగతి చదువుతున్న అమ్మాయి ఓ వ్యక్తితో ఫోన్ లో స్నేహంగా ఉండేది. అది స్నేహమనే అనుకుంది.. కానీ ఆ స్నేహాన్ని ఆ యువకుడు చెడుగా అర్థం చేసుకున్నాడు. ఆ అమ్మాయిని తన దగ్గరకు పిలిపించుకున్నాడు.. ఆమెను రేప్ చేశాడు. దీంతో బాధితురాలు ఏమి చేయాలో తెలీక చివరికి ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడం చూసి రక్షించారు.

ఈ ఘటన పాకిస్థాన్ లోని ముల్తాన్ లో చోటు చేసుకుంది. శుక్రవారం నాడు ఆ అమ్మాయి డేరా ఘాజీ ఖాన్ నుండి ముల్తాన్ కు బయలుదేరి వెళ్ళింది. తనకు మొబైల్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్ ను కలవడానికి వెళ్ళింది. ఆ వ్యక్తి ఆమెను రేప్ చేశాడు. 11వ తరగతి చదువుతున్న ఆ యువతికి ఏమి చేయాలో తెలీలేదు. దీంతో కొన్ని ట్యాబ్లెట్లు తెచ్చుకొని మింగేసింది. ఆమె అలా పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆమెకు ప్రథమ చికిత్స చేయించిన పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. ఆమె పరిస్థితి ఇప్పుడు క్రిటికల్ గా ఉందని పోలీసులు తేల్చారు. ఆమె మొబైల్ డేటా ఆధారంగా ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here