ప్రదీప్ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు.. కారులో ఉన్న వాళ్ళెవరు..!

యాంకర్ ప్రదీప్ మద్యం తాగుతూ అడ్డంగా దొరికిపోవడం టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. మోతాదుకు మించి చాలా చాలా ఎక్కువ తాగాడని అందరికీ తెలిసిపోయింది. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లో జరిగిన తనిఖీల్లో దొరికిపోయారు. స్కోడా కంపెనీకి చెందిన టీఎస్ 07 ఈయూ 6666 కారులో డ్రైవింగ్ చేస్తూ బయలుదేరిన ప్రదీప్ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు కొద్దిసేపటికే దొరికిపోయాడు. ముఖం కనపడకుండా చేతులు అడ్డు పెట్టుకోవడం.. వదిలేయండి అని అడగడం అన్నీ జరిగిపోయాయి.

ప్రదీప్ పట్టుబడ్డ సమయంలో అతని పక్కన ఉన్న అమ్మాయి ఎవరన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఎవరామె? ప్రదీప్‌‌కు ఆమెకు ఉన్న సంబంధమేంటి? ఆ అమ్మాయి కూడా మద్యం మత్తులో ఉందా? ఇద్దరూ మద్యం సేవించే కారెక్కారేమో? అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. పెళ్ళి.. పెళ్ళి.. అని ప్రదీప్ అంటూ ఉంటాడు కదా.. ఆమె ఎవరు అని ప్రదీప్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here