పొలం ప‌నులు ముగించుకుని ఇంటికొచ్చే స‌రికి ఫ్యాన్‌కు..

కార‌ణాలు తెలియ‌రావ‌ట్లేదు గానీ ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఆమె పేరు అనిత‌. 17 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న అనిత ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని స‌కలేశ‌పుర తాలూకా బాగె అర‌సున‌గ‌ర‌లో అనిత త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి నివ‌సిస్తున్నారు.

స‌క‌లేశ‌పుర తాలూకా కేంద్రంలోని ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో ఆమె ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతున్నారు. అనిత తండ్రి రైతు. పొలం ప‌నులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వ‌చ్చే స‌రికి ఫ్యాన్‌కు వేలాడుతున్న కుమార్తె మృత‌దేహాన్ని చూసి హ‌తాశుడ‌య్యారు తండ్రి.

ఈ విష‌యాన్ని ఆయ‌న పోలీసుల‌కు తెలియ‌జేశారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు అనిత మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స‌క‌లేశ‌పుర ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌క‌లేశ‌పుర రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here