ద‌త్త‌త తీసుకున్న కుమార్తెపై స్నేహితుల‌తో క‌లిసి గ్యాంగ్‌రేప్ చేసిన కిరాత‌క మారుతండ్రి!

భువ‌నేశ్వ‌ర్: ఒడిశాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ద‌త్త‌త తీసుకున్న 12 ఏళ్ల కుమార్తెపై త‌న పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాడో మారు తండ్రి. అయిదుమంది స్నేహితుల‌తో క‌లిసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘాతుకానికి ఆ బాలిక మారు త‌ల్లి కూడా స‌హ‌క‌రిచింది. ఆ బాలిక ఇప్పుడెక్క‌డుంది? ఏమైంద‌నేది అంతు చిక్క‌ట్లేద‌ని పోలీసులు చెబుతున్నారు.

బాలాసోర్ జిల్లాలోని పుతిబంధ గ్రామంలో ఈ అమాన‌వీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బాధిత బాలిక వ‌య‌స్సు 12 సంవ‌త్స‌రాలు. కెదువా గ్రామానికి చెందిన బారి హేమ్‌బ్ర‌మ్ కుమార్తె. పుతిబంధ గ్రామానికి చెందిన సునారామ్ సింగ్ అనే వ్య‌క్తి బాలిక‌ను నాలుగు రోజుల కింద‌టే ద‌త్త‌త తీసుకున్నాడు. ఈ నాలుగు రోజుల్లోనే ఆమెను తీవ్రంగా హింసించాడు.

ఇంటి పనంతా చేయించేవాడు. దీనితో బాలిక అనారోగ్యానికి గురైంది. త‌న‌ను త‌న అస‌లు తండ్రి వ‌ద్ద వ‌దిలేయాల‌ని కోరిందా బాలిక‌. దీనికి స‌రేన‌న్న సునారామ్‌.. ఆమెను సైకిల్‌పై ఎక్కించుకుని కెదువా గ్రామానికి బ‌య‌లుదేరాడు.

త‌న స్నేహితుల‌ను పిలిపించి, మార్గ‌మ‌ధ్య‌లో ఓ చెరువు వ‌ద్ద ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం ఆమెను అక్క‌డే వ‌దిలేసి వెళ్లిపోయారు. బాలిక అస‌లు తండ్రికి ఈ విష‌యం తెలియ‌డంతో అత‌ను బెర్హంపూర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

 

దీనితో వారు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. త‌మ నేరాన్ని అంగీక‌రించారు. దీనికి స‌హ‌క‌రించిన సునారామ్ సింగ్ భార్య‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. బాలిక‌ను సంఘ‌ట‌నాస్థ‌లంలోనే వ‌దిలేశామ‌ని వారు చెప్పారు. ఆమె కోసం వెత‌గ్గా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here