ఆమెపై సొంత పెదనాన్నే అత్యాచారం చేశాడు.. ఎందుకు చెప్పలేదు.. ఎలా విషయం బయటపడిందంటే..!

కంటికిరెప్పలా చూసుకోవాల్సిన పెదనాన్నే ఆ యువతిపై అత్యాచారం చేశాడు. కొన్ని నెలలుగా ఆమెను లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. ఇంతకూ ఆమె ఎందుకు బయట చెప్పుకోలేకపోయిందంటే ఆమె ఓ మానసికవికలాంగురాలు కాబట్టి..! చివరికి ఆమెకు ఎనిమిది నెలల గర్భం కావడంతో విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.

బెంగళూరుకు చెందిన 51సంవత్సరాల ఎజాజ్ పాషా.. 21 సంవత్సరాల మానసిక వికలాంగురాలైన యువతిపై చాలా కాలంగా అత్యాచారం చేస్తూ ఉన్నాడు. బుద్ధి మాంద్యం ఉన్న యువతి కడుపు పెరుగుతూ వెళుతుండడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. ఆమెను ఎవరో అత్యాచారం చేశారని వైద్యులు చెప్పారు. ఆ విషయాన్ని ఆమెతో అడుగగా పెదనాన్నే తనతో అలా చేసేవాడని చెప్పుకొచ్చింది. దీంతో కుటుంబసభ్యులే అతడిపై పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. హొసకోటే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here