వేరొక‌రితో పెళ్లికి రెడీ అయిన బోయ్‌ఫ్రెండ్‌ను కాల్చిచంపింది! కార‌ణం తెలిస్తే..పాపం అనిపిస్తుంది!

చండీగ‌ఢ్‌: ఆ యువ‌తి వ‌య‌స్సు 17 సంవ‌త్స‌రాలు. ఇంకా మైన‌రే. సురేఖ (పేరు మార్చాం) అనే ఆ యువ‌తి ఆ వ‌య‌స్సులోనే త‌న ఎక్స్ బోయ్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపింది. దీనికి కార‌ణం.. ఈమెను ప్రేమించి, వేరొక‌రితో పెళ్లికి రెడీ అయ్యాడు. పెళ్ల‌యిన త‌రువాత కూడా త‌న‌తో వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగించాల‌ని లేదంటే.. త‌న‌తో సాగించిన ప్రేమాయ‌ణాన్ని అందరికీ చెబుతానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు.

ఈ బ్లాక్‌మెయిల్‌కు ఆ యువ‌తి అద‌ర లేదు, బెద‌ర లేదు. కాల్చి ప‌డేసింది. జైలు పాలైంది. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలోని సోనెప‌ట్ జిల్లాలో చోటు చేసుకుంది. హ‌తుడి పేరు దీప‌క్‌కుమార్‌. 19 సంవ‌త్స‌రాల దీప‌క్ కుమార్ ప్ల‌స్ టూ చ‌దివాడు. జిల్లాలోని మ‌తిందు గ్రామానికి చెందిన స‌ముంద‌ర్ సింగ్ అనే రైతు కుమారుడు అత‌ను.

దీపక్‌కుమార్ మృత‌దేహం కింద‌టి నెల 21వ తేదీన‌ అత‌ని సొంత పొలంలో ల‌భించింది. గొర్రెలు, మేక‌ల‌కు కాప‌లాగా త‌న కుమారుడు రాత్రిపూట పొలంలోనే నిద్రిస్తుంటాడ‌ని, తెల్లారేస‌రికి అత‌ని మృత‌దేహం నిర్జీవంగా క‌నిపించింద‌ని స‌ముంద‌ర్ సింగ్ చెబుతున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మృత‌దేహం ప‌క్క‌న పోలీసుల‌కు ల‌భించిన కొన్ని చేతి గాజుల ముక్క‌లు హంతకురాలిని ప‌ట్టిచ్చాయి. చేతి గాజుల ముక్క‌లు ల‌భించ‌డం, వాటికి ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉండ‌టంతో పోలీసులు డీఎన్ఏ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు.

అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని ప‌రీక్షించ‌గా.. సురేఖ డీఎన్ఏతో స‌రిపోయింది. దీనితో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న నేరాన్ని అంగీక‌రించింది.

దీప‌క్‌కుమార్ వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధ‌ప‌డిన‌ప్ప‌టికీ.. తాను ప‌ట్టించుకోలేదని, పెళ్లి త‌రువాత త‌న‌తో వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగించాల‌ని బ‌ల‌వంతం పెడుతున్నాడ‌ని ఆమె వెల్ల‌డించింది. దీనితో మరో దారి లేక అత‌ణ్ణి కాల్చి చంపిన‌ట్లు ఒప్పుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన ఖ‌ర్కోడా పోలీసులు..మైన‌ర్ కావ‌డంతో ఆమెను జువైన‌ల్ హోమ్‌కు తర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here